మాధవరం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీ య ఉపాధిహామీ పథకం కింద కోటి 80లక్షల నిధులతో చేపడుతున్న నిర్మాణపనులను పంచాయతీరాజ్ ఈఈ జి. విజయ్ కుమార్ , డీఈ కెమాధవరెడ్డిలు గురువారం పరిశీలించారు. గ్రామానికి చెందిన కొందరు రోడ్లు వేయకుండా నిధులు దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాధు చేశారు. ఆఫిర్యాదు మేరకు ఈఈ, డీ ఈ మాధ వరం గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. రెండు రోజుల క్రితం క్యూసీ అధికారులు కూడా జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈఈ, డీఈ లు పరిశీలించి ఎస్టిమేట్ లో శాంక్షన్ మేరకు పనులు జరుగుతున్నట్లు గుర్తించి సంతృ ప్తి వ్యక్తం చేశారు. గతంలో రోడ్లు పొలాలకంటే త క్కువలో ఉండి ఇబ్బందిగా వుండగా పోలాలకంటే ప్రస్తుతం చేస్తున్న రోడ్డు ఎత్తుగా వేసేందుకు ఎస్టిమేట్స్ వేశామని, మంజూరైన నిధులు ఆమేరకు ఎపొలాల కంటే ఎక్కువ ఎత్తులో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రైతులు రాక పోకలు సాగించేందుకు ఎలాంటి ఇబ్బందులు వుండబోవని అధికారులు సంతృప్తి చెందారు. నాణ్యతా ప్రమాణాలకు తగ్గకుండా పనులు చేయించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాట్ కొండ శ్రీనివాసరావు, మండల పంచాయితీ రాజ్ ఏఈ ఎం.వెంటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
