తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం హెచ్ పీ వీ టీకాను 15 సంవత్సరాల బాలికలకు అందించారు. వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజేష్, ఎంఈఓ – 2 సుధాకర్ రావులు టీకాను లాంఛనంగా ప్రారంభించి బాలికలను తల్లిదండ్రులకు తగిన జాగ్రత్తలు సూచించారు. 0.5 మి.లీ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వటం జరుగుతుందని దీనివల్ల ఎంతో ఉపయోగం ఉందని వైద్యులు వివరించారు. పీహెచ్సీ పరధిలో 149 మందికి వ్యాక్సిన్ అందించాలి లక్ష్యంగా పెట్టుకోగా గురువవారం 30 మందికి వ్యాక్సిన్ వేసారు. సీహెచ్ రమణ, పీహెచ్ఎన్ విజయ కుమారి, హెచ్ ఎన్ రవి ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
