రైతన్నకు భరోసా- నేడు అన్నదాత సుఖీభవా, – హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు – వివరాలు వెల్లడించిన జెడీఏ ఎస్ శ్రీనివాసరావు – నూతన జిల్లాలో 1,88,056 మంది రైతులకు అందనున్న అన్నదాత సుఖీభవా రూ. 75.22 కోట్లు -పీఎం కిసాన్ రూ.33.08 కోట్లు- మొత్తం రైతులకు రూ. 108.30 కోట్ల మేర లబ్ధి

ఇచ్చిన మాటలకు కట్టుబడి రైతన్నలకు అండగా నిలుస్తున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు. అందులో బాగంగా పంట సాగుకు రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో అన్నదాత సుఖీభవ సంవత్సరానికి రూ.14వేలు, పీఎం కిసాన్ పథకాన్ని ఏటా రూ. 6వేలు ఇస్తూ అమలు చేస్తున్నారు. ఎన్ డీ ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాజాగా మూడవ దఫా నిధులను శుక్రవారం విడుదల చేయటానికి సిద్దమయ్యారు. ఇందులో బాగంగా విభజన జిల్లాలో 1,88,056 మంది రైతులకు అన్నదాత సుఖీభవ (ఎడి ఎస్ బి ) రూ.4వేల రూపాయల చొప్పున రూ.75.22 కోట్లు,, పీఎం కిసాన్ 1,65,400 మంది రైతులకు రూ. 2వేలు చొప్పున రూ.33.08 కోట్లు మొత్తం 108.30 కోట్లు రైతుల ఖాతాల్లో జయచేయనున్నారు.
అర్హత గల ప్రతి రైతు ఖాతాల్లో జమ ..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో బాగంగా అన్నదాత సుఖీభవ కి రూ. 20, వేల అందజేస్తామని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే అధికారంలోని వచ్చాక పీఎం కిసాన్ సాయం ఆరువేల తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14వేలు జమ చేసి ఈ మొత్తాన్ని మొదటి దఫా ఆగష్టు 2న ఖరీఫ్ క్రింద ఒక్కో రైతుకు ర ,అక్టోబర్ లో రబీకి రూ. 7వేలు జమ చేయగా తాజాగా తుది విడుత రూ. 7వేలు ప్రకారం ఇవ్వనున్నారు. మొత్తంగా ఏటా రూ.20,000 ప్రకారం పెట్టుబడి సాయం అందనుంది. జిల్లాలో రైతులు, కౌలు రైతులు, ఆర్ఓ ఎస్ఆర్ భూములు చేసుకునే రైతులకు సైతం ఈ మొత్తం సాయం అందనుంది. ఉమ్మడి జిల్లాలో మొదటి దఫా 2,68,165 మంది రైతులకు అన్నదాత సుఖీభవ రూ. 134 కోట్లు, 2,43,000 పీఎం. కిసాన్ వైఎస్సార్ రైతు భరోసా రూ. 48.60 అందనున్నది. రెండవ విడుతలో అన్నదాత సుఖీభవ 2,68, 165 మంది రైతులకు రూ. 134.08 కోట్లు, పీఎం కిసాన్ నిథులు 2,31,383 మంది రైతులకు రూ.46.28 కోట్లు మొత్తం 180.36 కోట్లు అందగా, మూడవ విడుత తాజాగా విభజన ప్రకాశం జిల్లాలో 1,88,056 మంది రైతులకు అన్నదాత సుఖీభవలో రూ. 75.22 లు, పీఎం కిసాన్లో 1,65,400 మంది రైతులకు రూ. 33.08 కోట్లు మొత్తం 108.90 కోట్లు అందనున్నాయి.

ఈ మొత్తం ఈనెల 13న సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విడుదల చెయటానికి క్రిష్ణా జిల్లా గంగవరంలో ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు, పీఎం కిసాన్ ప్రొగాం పీఎం నరేంద్రమోదీ చేతుల మీదుగా గౌహతిలో ప్రారంభిస్తారని జెడీఏ శ్రీనివాసరావు తెలిపారు.

మూడవ విడుత నిధులు విడుదల …
ఎస్ శ్రీనివాసరావు, జెడీఏ, వ్యవసాయశాఖ, ఒంగోలు.

సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విడుదల చేయటానికి క్రిష్ణా జిల్లా గంగవరంలో ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
పీఎం కిసాన్ ప్రోగాం పీఎం నరేంద్రమోదీ చేతుల మీదుగా గౌహతిలో ప్రారంభిస్తారు.
విభజన ప్రకాశం జిల్లాలో రైతులు రూ. 108.30 కోట్ల మేర లబ్ది పొందనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *