నిరంతర స్క్రీనింగ్, మరియు వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే కాన్సర్ ను నివారించ వచ్చు అని,
నిరంతం పారిశుద్ధ్యం కోసం పని చేసే వర్కర్స్ కు కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టడం శుభపరిణామం అని
ఒంగోలు మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒంగోలు జి జి హెచ్ లో ప్రివెంటివ్ ఆంకాలజి విభాగం లో
ఒంగోలు కార్పొరేషన్ పరిధి లోని పారిశుధ్య మరియు ఇతర విభాగంలో పని చేసే మహిళా సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన మెగా కాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ను జి జి హెచ్ సూపరెంటెండెంట్ డా మాణిక్య రావు, కమిషనర్ కే వెంకటేశ్వరరావు తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భగా మేయర్ మాట్లాడుతూ ముందుగా లక్షణాలు గుర్తించడం రాకుండా జీవన శైలిలో మార్పులు ఎంతో ముఖ్యమని అన్నారు. జి జి హెచ్ సూపరెంటెండెంట్ డా మాణిక్య రావు మాట్లాడుతూ జి జి హెచ్ లో ప్రివెంటివ్ అంకాలజి విభాగం ఓ పి నిరంతం సేవలు అందిస్తున్నామని, వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందిస్తామన్నారు. పరీక్షల కోసమే కాకుండా కౌన్సిలింగ్ కోసం కూడా రావచ్చని అన్నారు. సర్జికల్ అంకాలజి, మరియు రేడియేషన్ అంకాలజి వైద్యులు జి జి హెచ్ లో అందుబాటు లో వున్నారని అన్నారు.
పారిశుధ్య కార్మికులే కాకుండా ఇతర విభాగాల్లో కార్మికుల ఆరోగ్య రక్షణ కు ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకునేలా సిబ్బందికి సూచనలు ఇచ్చామన్నారు. పరీక్షల కోసం సహకారం అందిస్తున్న జి జి హెచ్ వైద్యులకు
సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం పాల్గొన్న జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ హెచ్పివి వాక్సిన్ 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలిక వాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సి ఎస్ ఆర్ ఎమ్ ఓ డా మాధవి లత ,
కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డా శ్రీదేవి, గైనకాలజి విభాగ అధిపతి డా సంధ్య రాణి, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డా వైష్ణవి, కార్పొరేషన్ సానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
