ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానంఎంతో అవసరం.ఎస్.అన్వర్ భాషా కమాండెంట్ (సి ఎస్ ఓ)

హైదరాబాద్ మార్చి 12
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం
ఎంతో అవసరం.ఎస్.అన్వర్ భాషా కమాండెంట్ (సి ఎస్ ఓ)అన్నారు.టి జి ఎస్ పి ఎఫ్ డి జీ పీ ఆదేశాల మేరకు గురువారం హైదరాబాద్ హై కోర్ట్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు.ప్రోటోకాల్ రిజిస్టర్ శ్రీధర్ రావుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం గం 12లవరకు నిర్వహించారు. శిబిరంలో నిమ్స్ పంజాగుట్ట ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. ఈ శిబిరంలో కార్యక్రమంలో టి జి ఎస్ పి ఎఫ్ సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ టి. రజినీకాంత్ రెడ్డి .చేతుల మీదుగా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సందర్భంగా అన్వర్ బాషా మాట్లాడుతూ ఈ రక్తదానం తో ఎంతో మందికి ప్రాణ దానం చేయవచ్చన్నారు
ఏసి ఎమ్మెస్ రెడ్డి శ్రీనివాసరావు సిఐలు ,ఎస్సైలు ,ఏఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *