త్వరితగతిన వైద్య సేవలతో తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి కొత్త హంగులు.ఆర్టీసీ ఆసుపత్రిలో రోగుల వద్దకే వెళ్లే అత్యాధునిక పోర్టబుల్ ఎక్సరే సౌకర్యం ఇకపై ఆర్టీసీ ఆసుపత్రిలో అందుబాటులోకి.

హైదరా బాద్ మార్చి 13
(జే ఎస్ డి ఎం న్యూస్) : తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి కొత్త హంగులు.సమకూరాయి.
ఆర్టీసీ ఆసుపత్రిలో రోగుల వద్దకే వెళ్లే అత్యాధునిక పోర్టబుల్ ఎక్సరే సౌకర్యం ఇకపై ఆర్టీసీ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకు వచ్చారు .తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి కెనరా బ్యాంక్ క్యాన్ ఫిన్ హోమ్స్ రూ. 20 లక్షల విలువైన పోర్టబుల్ ఎక్సరే మిషన్ అందజేసింది.
​ఈ మిషన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కెనరా బ్యాంక్ జోనల్ హెడ్ గూడ లక్ష్మణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ & సీఎంఓ ఎన్.శైలజ మూర్తి లు ప్రారంభించారు.తెలంగాణ ఆర్టీసీ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి చొరవతో తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి వైద్య సేవల్లో మరో ముందడుగు సాధించింది. సామాజిక బాధ్యతలో భాగంగా కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ క్యాన్ ఫిన్ హోమ్స్ వారు రూ. 20 లక్షల విలువైన అత్యాధునిక ‘మొబైల్ డిజిటల్ పోర్టబుల్ ఎక్సరే’ మిషన్‌ను ఆసుపత్రికి విరాళంగా అందజేశారు. ఈ నూతన యంత్రాన్ని కెనరా బ్యాంక్ తెలంగాణ జోనల్ హెడ్ గూడ లక్ష్మణ్ , ఆసుపత్రి సూపరింటెండెంట్ & సిఎమ్ఓ ఎన్.శైలజ మూర్తి శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ & సీఎంఓ శైలజ మూర్తి మాట్లాడుతూ.. సమాజ సేవలో భాగంగా బ్యాంకింగ్ సంస్థలు ముందుకు వచ్చి తమవంతు సహాయం అందించడంఅభినందనీయమని కొనియాడారు. ఈ మొబైల్ డిజిటల్ పోర్టబుల్ ఎక్సరే మిషన్
అందుబాటులోకి రావడంతో వార్డుల్లో ఉన్న పేషంట్ల వద్దకే నేరుగా వెళ్లి ఎక్సరే తీసే అవకాశం ఉంటుందని, దీనివల్ల రోగులకు మరింత త్వరితగతిన మరియు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆమె వివరించారు.
​కెనరా బ్యాంక్ తెలంగాణ జోనల్ హెడ్ గూడ లక్ష్మణ్ మాట్లాడుతూ.ఆర్టీసీ ఉద్యోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వీసీ & ఎండీ నాగిరెడ్డి నేతృత్వంలో తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కెనరా బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ అడ్మినిస్ట్రేటర్ పి. శ్రీనివాస్, కెనరా బ్యాంక్ మేనేజర్లు టి.టి. అచ్యుతానందం, అశోక్ గౌతమ్, పలువురు వైద్యులు మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *