గుంటి గంగా ఆలయ పరిధిలో దుకాణాల నిర్వహణ హక్కులకు వేలం పాటలు నిర్వహణ

జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయ పరధిలో దుకాణాల నిర్వహణకు, కొబ్బరి కాయలు, ప్రసాదాల అమ్మకానికి, తిరునాళ్ల రోజు, సంవత్సర కాల పరధిలో హక్కులకు శుక్రవారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించారు. 2026 ఎప్రియల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు ఆలయ పరిధిలో కొబ్బరికాయలు, పూజా ద్రవ్యముల వగైరాల అమ్మకానికి రూ. 5,91,000లకు, కొబ్బరి చిప్పల ప్రొగు చేసుకునే హక్కు కోసం రూ. 2 లక్షలకు, తిను బండారాలు, హోటల్ నిర్వహణకు రూ.1,60,000లకు వేలం పాటలో పాల్గొని హక్కుదారులు దక్కించుకున్నారు. తిరునాళ్లు రెండు రోజులకు గాను కొబ్బరి కాయలు, పూజా ద్రవ్యాలు అమ్ముకునేందుకు గాను రూ. 4,14,000లకు, కొబ్బరి చిప్పల ప్రొగుకు రూ. 71,000కి పాడుకున్నారు. ఆయా హక్కులకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 11,75,000 లు ఆదాయం రాగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 14,36,000లు వచ్చింది. అనగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం అమ్మవారికి రూ. 2,61,000 లు ఆదాయం అదనంగా వచ్చినట్లయిందని ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) నర్రా నారాయణ రెడ్డి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎప్రియల్ 3న గుంటి గంగా భవాని తిరునాళ్ల….

తాళ్లూరు మండలంలోని సోమవర ప్పాడు గ్రామ రెవిన్యూ పరధిలో
వేంచేసి ఉన్న జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారి తిరునాళ్ల ఎప్రియల్ 3న నిర్వహించుటకు దేవాదాయ శాఖ, పండితులు నిర్ణయించినట్లు దేవాలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) నర్రా నారాయణ రెడ్డి తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఒక ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *