ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వమే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి -పూర్తిస్థాయి శిక్షణ పొందిన డ్రైవర్ల ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు-రాష్ట్ర మంత్రికి వినతిపత్రాన్ని అందించిన సుజన్ మాదిగ

ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వమే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని దీని ద్వారా పూర్తిస్థాయి శిక్షణ పొందిన డ్రైవర్ల ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు చేపట్టాలని కోరుతూ ఎం ఎస్ పి ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు క్రీడలు యువజన సర్వీసు మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డిని రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము సుజన్ మాదిగ కలిసి వినతిపత్రాన్ని అందించడం జరిగింది. ప్రైవేటు డ్రైవర్లు అరకొర శిక్షణ ద్వారా ఆర్టీసీ బస్సులను నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం తీవ్రంగా జరుగుతుందని దీనిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి జిల్లాలో కేంద్రంలో ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ శిక్షణా కేంద్రాల నుండి నిరుద్యోగ యువతకి డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంగళరావు ,ఎం.ఎస్. పి.ఎస్. ప్రతినిధులు గద్దే త్యాగరాజు డొక్కా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *