గ్యాస్ నిల్వలు, పంపిణీ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు- జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్ పద్మ శ్రీ

ఇరాన్- ఇజ్రాయేల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ నిల్వలు తగ్గి, ధరలు పెరుతాయన్న అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్ పద్మ శ్రీ కోరారు. ప్రకాశం జిల్లాలో ఎల్ పీ జి గృహ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తగినంత నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాధారణ గృహ వినియోగదారులు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్ వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలలుల, వైద్య ఆరోగ్య అవసరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్యాస్ సిలిండర్ లు అక్రమంగా నిల్వ చేసినా మరియ అక్రమ విక్రయాలు చేసినా నిత్యావసర సరకులు చట్టం 1955 క్రింద కేసులు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యలు ఎమైనా ఉంటే ప్రకాశం జిల్లా కంట్రోల్ రూమ్ సంబర్ 1077కు 24 గంటలలొ ఎప్పుడైనా కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *