ఉమ్మడి జిల్లాలో ఘనంగా అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిథులు విడుదల కార్యక్రమం నిర్వహణ -అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబుతోనే సాధ్యం – డాక్టర్ ముక్కు – ఉగ్ర ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడుత నిధుల విడుదల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ – పామూరు మండలం నుచ్చుపొదలో పాల్గొన్న పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్ర

అభివృద్ధి సంక్షేమం సీఎంచంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని టిడిపి ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడుత నిథుల విడుదలను ఆయన జిల్లాలో కనిగిరి నియోజక వర్గ పామూరు మండలం నుచ్చుపొదలో రైతుల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం మూడు విడుతలతో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రూ. 20వేలు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 3,40,246 మంది రైతులకు అన్నదాత సుఖీభవ రూ.136.1, పీఎం కిసాన్ నిథులు రూ. 59.71 మొత్తం 195.8 కోట్ల మేర రైతులు లబ్ధిపొందనున్నట్లు చెప్పారు. అందులో కనిగిరి నియోజక వర్గంలో 42,302 మంది రైతులకు రూ. 24.30 కోట్లు మేర లబ్ధిపొందనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన చెక్కును రైతులకు అందించారు. సీఎం చంద్రబాబు నాయుడు సందేశాన్ని ప్రత్యేక స్కీన్ ఏర్పాటు చేయించి రైతులకు వినిపించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో సంబంధిత ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిథుల విడుదల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందేశాన్ని వినిపించారు. కొండేపి నియోజక వర్గంలో పొన్నలూరు మండలంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ముఖ్య అతిథిగా పాల్గొని కొండేపి నియోజక వర్గంలోని 36,808 మంది రైతులకు చెందిన రూ.21.10 కోట్ల చెక్కును రైతులకు అందించారు.

ఒంగోలులో యర్రజెర్లలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఒంగోలు అర్బన్ డవలప్ మెంట్ అధారిటీ చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొని ఒంగోలు నియోజక వర్గానికి చెందిన 5048 మంది రైతులకు రూ. 3.028 కోట్ల చెక్కును అందజేసారు. ఆయా కార్యక్రమాలలో జిల్లా, డివిజన్, మండల వ్యవసాయాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *