తొలి తెలుగు కవయిత్రి, రామాయణ మహా గ్రంథ తెలుగు అనువాది, స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్షను చేదించుకొని వెలుగు చూసిన నారీమణి కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి మరియు సిబ్బంది శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆర్ఐ రమణారెడ్డి మాట్లాడుతూ 16వ శతాబ్దంలో స్త్రీలు, అణగారిన కులాల పట్ల సమాజంలో ఉన్న వివక్షను ఛేదించుకొని వెలుగు చూసిన నారీమణి మరియు తెలుగు మొదటి కవయిత్రి మొల్ల తన కవితా కళతో అందరికి ఆదర్శంగా నిలిచిందని, ఆమె జీవించిన కాలంలో వర్ణ దురహంకారన్నీ ఎదుర్కొని తనని తాను నిరూపించుకున్న సాహసి అని, స్త్రీలు వంటింటికే పరిమితం అనే ఆ రోజుల్లో తన రచనలతో సామాజిక స్పృహ కొరకు పాటు పడిందని, ఎక్కడ స్త్రీలకు అన్యాయం జరిగినా అక్కడ వారి కోసం దైర్యంగా పోరాడిందని, మూడ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు పలురకాలుగా కృషి చేసిందని, ఆమె చివరి శ్వాస వరకు తన రచనలతో సమాజ అభ్యుదయం కొరకు పాటుపడిందని కొనియాడారు.
తెలుగు సాహితీ సరస్వతికి మొల్ల అందించిన “మొల్ల రామాయణము” కంఠ ఆభరణం వంటిదని, కవితను పరిమితితో అల్లగల ప్రతిభాశాలైన ఆమె తన సరళ రమణీయమైన రచనా శైలి వలన సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువాదించిన ఆమె “మొల్ల రామాయణం” విద్యాలయాలలో పాఠ్యాంశం అయ్యిందని పేర్కొన్నారు.
