బేగంపేట మార్చి 14 ,(జే ఎస్ డిఎం న్యూస్) :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తుందని ,యువ నాయకులు రాహుల్ ,అభిషేక్ అడపాలు అన్నారు. శనివారం సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ కష్టం బస్తీలో ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చిన ఈద్ కా తోఫా కిట్లను వారు పంపిణీ చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ కోట నీలిమ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ ,అభిషేక్ అడపాలు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒకటొకటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. వివిధ పండుగలకు ఆయా వర్గాలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. సుమారు 400 ఈద్ కా తోఫా కిట్లను సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీ,బ్రాహ్మణవాడి ,మాతాజీ నగర్ తదితర బస్తీల కు చెందిన ముస్లిం మైనార్టీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనీఫ్ ఖాన్, మునీర్ ఖాన్ , అల్తామష్, నసీర్ , ఆయుబ్ ,బబ్లు,నవాజ్ ఇబ్రహీం, తస్లీమ్ జమీర్, జులేఖ చంద్రకళ రాధా తదితరులు పాల్గొన్నారు.

