అద్దంకి ఆర్డీవో జాన్సన్ శనివారం రామ్ నగర్ లోని వి ఎస్ ఎన్ ఆర్ ఎంటర్ ప్రైజెస్ భారత్ గ్యాస్ ఏజెన్సీస్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. స్టాక్ పాయింట్లో ఉన్న సిలిండర్ల స్టాకు వివరాలను పరిశీలించారు. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకున్న 25 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సిలిండర్లు డెలివరీ చేయాలని నిర్వాహకులకు చెప్పారు. బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే చర్యలు ఉంటాయన్నారు. తహసిల్దార్ శ్రీ చరణ్ రెవెన్యూ సిబ్బంది తనిఖీలలో పాల్గొన్నారు.

