తాళ్లూరు మండలంలో ఎంపీడీఓ అజిత ఆధ్వర్యంలో పంచాయితీ, నచివాలయ సిబ్బంది ఆయా గ్రామాలలో ముమ్మరంగా పన్నులు వనూలు చేపట్టారు. సెలువు దినం అయినప్పుటికి పట్టువదలని విక్రమార్కుల వలే ఆయా వాణిజ్య సముదాయాలకు, ప్రవేట్ పాఠశాలలకు వెళ్లి వారు చెప్పిన గడువును పదే పదే గుర్తు చేస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా పన్నులు వనూలు చేపట్టంపై ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండల మహిళా సభ్యులను, రాజకీయ ప్రధాన నాయకులను సైతం ఉపయోగించుకుంటూ పన్నుల వనూలు వేగవంతం చేసారు. తూర్పుగంగవరం, తాళ్లూరులలో శనివారం పన్నులు వసూలు కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ అజితతో పాటు డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, గ్రామ కార్యదర్శులు డి నాగమల్లేశ్వరి, షేక్ షహనాజ్ బేగం, శేషమ్మ, శ్రీ వల్లి, రామా రావు తదితరులు పాల్గొన్నారు.

