స్రీనిధియన్స్ “వాక్ ఫర్ ఏ కాజ్”నెక్లెస్ రోడ్‌లో నిర్వహణ.

హైదరాబాద్, మార్చి 15:
(జే ఎస్ డి ఎం న్యూస్)
చిన్నారుల విద్యాభివృద్ధి మరియు సంతోషకరమైన బాల్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్న విద్యార్థుల ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ బచ్పన్ ప్రయాస్ ఆధ్వర్యంలో “స్రీనిధియన్స్ వాక్ ఫర్ ఏ కాజ్” కార్యక్రమం ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్క్ మరియు నెక్లెస్ రోడ్ ప్రాంతంలో నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో బచ్పన్ ప్రయాస్ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి చిన్నారికి విద్యా అవకాశాలు అందాలని, ఆనందకరమైన బాల్యం కలగాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వాక్ ఫర్ ఏ కాజ్ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పలు సామాజిక కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ విక్సారా ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు వాటర్ ప్యూరిఫైయర్లను అందించడం, ప్రాజెక్ట్ పునర్నిర్మాణ్ ద్వారా బాలికల కోసం పాఠశాలల్లో శౌచాలయాల పునర్నిర్మాణం, అలాగే ప్రాజెక్ట్ డిజి విజ్ఞాన్ ద్వారా డిజిటల్ విద్యకు సహకరించే ప్రొజెక్టర్లను ప్రభుత్వ పాఠశాలలకు అందించడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వ కార్తికేయ విద్యార్థుల సేవాభావాన్ని ప్రశంసించారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని ఆయన ప్రోత్సహించారు. ఒక చిన్న అడుగు కూడా పెద్ద మార్పుకు దారితీస్తుందనే సందేశాన్ని ఈ వాక్ కార్యక్రమం ద్వారా పాల్గొన్న వారికి అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *