ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు – సరైన పత్రాలు లేని 41 మోటార్‌ సైకిల్ లను పోలీసులు స్వాధీనం

శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడి, మరియు మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ బి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దర్శి టౌన్ లోనే ఆటోనగర్ లో పరిసర ప్రాంతంలో విస్తృత స్థాయిలో ఆపరేషన్ వజ్రా ప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, దర్శి సీఐ రామారావు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ పరికరాల ద్వారా అనుమానితుల తనిఖీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలు, గంజాయి కేసుల్లోని పాత ముద్దాయిల ఇళ్లు మరియు ఇతర ప్రదేశాలను సోదాలు చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 41 మోటార్‌ సైకిల్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొందరు వాహన యజమానులకు చలానాలు విధించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, మహిళలపై నేరాలు మరియు వాటి శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. తదనంతరం “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో స్థానిక ప్రజలతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. యువత, వ్యాపారులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని “గంజాయిని పారదోలుదాం – డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడుదాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు.

దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ గంజాయి మరియు మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *