ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 కు ఎంపీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 11 గంటలకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తో కలిసి పాల్గొంటారు. అలాగే సాయంత్రం నాలుగు గంటలకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ఒంగోలు గుంటూరు రోడ్డు లోని పి ఏ జి కన్వెన్షన్ హాల్లో జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ నిర్వహించు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6:30 కు బండ్ల మెట్ల నుండి కోట వీధిలో షేక్ మహబూబ్ బాషా నిర్వహించు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఏడు గంటలకు సింగరాయకొండలో షాదీఖానాలో దామచర్ల సత్య ఆధ్వర్యంలో నిర్వహించు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
17న జిల్లాలో ఎంపీ మాగుంట పర్యటన
15
Mar