పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుండి జిల్లాలో ప్రారంభం కానున్నాయి.
నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి
సి.వి.రేణుక ఇప్పటికే తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అందుకు సంబంధించిన ఏర్పాట్లు తీసుకోవాలని స్థానిక పోలీసులకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విభాగ పరీక్షలు, 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించారు. రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. ఇవి విద్యాపరమైన పరీక్షలు కాబట్టి 30 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, త్రాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తగిన రవాణా సౌకర్యం కల్పించారు. ఆర్టీసీ బస్సులలో వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం కల్పించారు. హాల్ టికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని గుర్తించవచ్చు.
పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్ లను మూసివేయటానికి, పోలీసుల అవసరమైన బందోబస్తు చర్యలు, 144 సెక్షన్ విధించి అమలు అయ్యేలా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిఎస్పి సిఐలు తగిన చర్యలు తీసుకున్నారు.
పరీక్షల నిర్వహణ ఇలా…
*. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 28,632 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నారు. ప్రైవేట్ విభాగంలో 21 మంది బాలురు, పదిమంది బాలికలు ఉన్నారు.
*. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి రెగ్యులర్ మరియు ఒకసారి ఫెయిల్ అయిన వారు 1144 మంది ఉన్నారు. వీరిలో 823 మంది బాలురు, 321 మంది బాలికలు పరీక్షలకు హాజరుకానున్నారు.
ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షల కోసం 165 సెంటర్లను, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల కోసం 14 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాలను జిల్లాస్థాయి మండల స్థాయి అధికారులు ఆదివారం పరిశీలించారు.


పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి – కంట్రోల్ రూమ్ ఏర్పాటు … జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక

ప్రకాశం జిల్లాలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థులు తప్పనిసరిగి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి సి వి రేణుక కోరారు. యూనిఫామ్ ధరింట పరీక్షలకు హాజరు కావద్దని, ఫర్బిడెన్ మెటీరియల్, బ్లూ టూత్ పరికరాలు, మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాలకు తీసుకు రావటం పూర్తిగా నిషేదించినట్లు చెప్పారు. పరీక్షలకు సంబంధించి ఎవైనా సమాచారం లేదా సందేహాలు ఉన్నట్లయితే జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్రూమ్ ລ້ 7842777439, 7842777239, 2 2 5 9848527224, సూపరిండెంట్ నంబర్ 782621830, సెక్షన్ అసిస్టెంట్ 9100929406, కంప్యూటర్ ఆపరేటర్ 9704663397లను సంప్రదించాలని కోరారు.