రైతన్న మీకోసం వారోత్సవాలను తాళ్లూరులో సో మవారం ప్రారంభించారు. రైతులకు నీరు, విత్తనం, ఎరువులు, సాంకేతికత, యంత్ర పరికరాలు, వ్యవసాయ రుణాలు, మార్కేటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిహారం అన్నింటిని నమగ్ర రూపంలో అందించటమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని వక్తలు అన్నారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, తహసీల్దార్ బి వి రమణా రావు, వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఏపీఎం దేవరాజ్, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, టిడిపి నాయకుడు ఇడమకంటి సుబ్బా రావు, సుబ్బా రావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారోత్సవాలు ప్రతి గ్రామంలో నిర్వహించి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, పథకాల గురించి వివరించటం జరుగుతుందని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు.
