జిల్లాకు సంబంధించి ఈవిఎంలను భధ్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భధ్రత ఉండాలి – జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు

జిల్లాకు సంబంధించి ఈవిఎంలను భధ్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భధ్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు
సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎన్నికల కమీషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో గల ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్లు (ఇవిఎం) గోదాముల‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకాశం జిల్లా కు సంబందించిన ఒంగోలు, ఎస్ ఎన్ పాడు, కొండేపి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, మొత్తం 8 నియోజకవర్గాలకు సంబందించిన ఈవీఎం లు, వి. వి ప్యాడ్స్, కంట్రోల్ యూనిట్స్, బ్యాలేట్ యూనిట్స్ లను అక్కడి భధ్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్షుణంగా పరిశీలన చేశారు. అప్ర‌మ‌త్తుంగా ఉండాల‌ని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు డిఆర్ఓ చిన ఓబులేసు, క‌లెక్టరేట్ సూప‌రింటిండెంట్ శ్రీనివాస రావు, వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్, టీడీపీ నుండి కాసుకుర్తి అంకరాజు, బీజేపీ తరపున గుర్రం సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్.కె రసూల్, బిఎస్పి తరపున గోపి రాజ్, ఒంగోలు తహసిల్దార్ మధుసూధన్ రావు, ఎనిమిది నియోజక వర్గాల డిటి లు, ఇత‌ర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *