ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని లారీ, టిప్పర్, ట్రైలర్, బస్పుస, మ్యాక్సి క్యాబ్, మోటర్ క్యాబ్, ట్రాక్టర్, ట్రైలర్ వాహన యజమానులు తమ వాహనాలకు చెల్లించవలసిన త్రైమాసిక పన్నులు వెంటనే చెల్లించాలని జిల్లా ఉప రవాణా కమీషనర్ ఆర్ సుశీల కోరారు. అదే విధంగా మోటార్ వాహన తనిఖీ అధికారులు కేసులు వ్రాసి చలానా కట్టకుండా ఉన్న వాహనాలను యజమానులు వెంటనే అపరాధ రుసుం చెల్లించాలని లేదంటే వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. ఇందు కోసం మోటార్ వాహన అధికారులు , సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్క వాహన దారుడు పన్నులు చెల్లించి ఫిట్ నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ట్యాక్స్ అన్నింటికి కూడ చెల్లుబాటు అయ్యే విధంగా ఉంచుకుని వాహనములను సడపాలని కోరారు. వాహన డ్రైవర్ సంబంధిత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని కోరారు. ద్విచక్ర వాహన దారుడు హెల్మెట్ ధరించి భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. జిల్లాలో మోటార్ వాహన ఇన్స్ఫెక్టర్లు ప్రత్యేక తనిఖీ చేపట్టి సంబంధిత వాహనాలను తనిఖీ చేస్తారని చెప్పారు. భద్రతా నియమాలు పాటించని వాహనాలను సీజ్ చేయబడునని వివరించారు.
