పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనాయి. జిల్లాలో 165 కేంద్రాలలో 28,465 మంది విద్యార్థులకు గాను 28,302 మంది విద్యార్థులు హాజరు కాగా 163 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సి వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మూడు కేంద్రాలను, జిల్లా పరిశీలకులు ఆరు కేఉంద్రాలకు, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక ఆరు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. 13 ప్లయింగ్ స్క్వాడ్ టీఎంలు 86 కేంద్రాలను తనిఖీ చేసారు. డైరెక్టర్ గర్నమెంట్ ఎగ్జామ్స్ కార్యాలయం నుండి వచ్చిన ప్రత్యేక బృందం 7 కేంద్రాలను అనగా అన్ని రకాల బృందాలు వెరసి 113 కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. మొదటి రోజు పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. పరీక్షా కేంద్రముల నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్, జిల్లా పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేసారు.
ఓపెన్ స్కూల్ ఎస్ ఎస్ సి తెలుగు పరీక్షకు 14 పరీక్షా కేంద్రాలలో 1017 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 774 మంది హాజరు అయ్యారు. ఉర్దూ పరీక్షలో 5 మంది విద్యార్థులకు గాను ఐదు మంది హాజరు అయినట్లు డీఈఓ సీవి రేణుక తెలిపారు. నాలుగు ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షా కేంద్రాలను సందర్శించినట్లు చెప్పారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
