వైసీపీ కార్యాలయంలో ఘనంగా అమరజీవి జయంతి

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం తో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని వక్తలు అన్నారు.
వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు . పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు . ఆయన చేసిన 58 రోజులు ఆమరణ నిరాదీక్ష వలన తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు మద్రాస్ వాసులుగా ఉండే వారని శ్రీరాములు లాంటి త్యాగధనుల వలన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలిసాయని కొనియాడారు… శ్రీరాములు జయంతి సందర్బంగా స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమం లో జిల్లా పార్టీ పరిశీలకులు బత్తుల బ్రాహ్మానందరెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్,వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, రొండా అంజిరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి,పల్నాటి రవీంద్రారెడ్డి,రాయని వెంకటరావు,తాతపూడి కరుణాకర్,పేరం ప్రసన్న, మీరవళి, ప్రసాద్, మేళం మధు, జిలాని బాషా,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *