యుద్ధ పరిస్థితుల నేపద్యంలో జిల్లాలో వినియోగదారుకు వంటగ్యాస్ సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు – జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

మధ్యప్రాచ్య దేశాలలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపద్యంలో జిల్లాలో వినియోగదారుకు వంటగ్యాస్ సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు పటిష్టంగా చేపట్టామని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్లోని విసి హాల్లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తో కలసి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వంటగ్యాస్ నిల్వల పరిస్థితి, సరఫరా, వినియోగదారులకు ఇబ్బంందులు తలెత్తకుండా చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల మూలంగా గ్యాస్ నిల్వలు తగ్గి, ధరలు పెరగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మి అపోహలు, ఆందోళనలకు గురికావద్దని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ప్రకాశం జిల్లాలో 5,51,759 డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్స్ ఉండగా, మార్కాపురం జిల్లా 3,22,279 డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్స్ ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. అలాగే ప్రకాశం జిల్లాలో 39 గ్యాస్ ఏజెన్సీ ఉండగా, మార్కాపురం జిల్లాలో 25 గ్యాస్ ఏజెన్సీ ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రోజుకు సగటున 9,875 సిలిండర్లు అవసరమై ఉండగా, డీలర్ల వద్ద 11,542 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులకు ఫస్ట్ ఇన్ – ఫస్ట్ అవుట్ విధానంలో వాటిని పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో స్టాక్ కొరత అనేది ఎక్కడా లేదని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజు జాయింట్ కలెక్టర్ , సంబందిట్ డీలర్ల తో సమావేశమౌతూ, రోజు వారీ నిల్వలు, బుకింగ్, పంపిణీ విధానాన్ని పర్యవేక్షించడం జరుగుచున్నదన్నారు. గృహ వినియోగదారులతో బాటు సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రులకు కూడా ప్రాధాన్యతగా గ్యాస్ సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో వంటగ్యాస్ సరఫరా సజావుగా జరుగుతోందన్నారు. ఎల్పీజీ నిల్వలు, పంపిణీ గురించి ప్రభుత్వ అధికారిక మార్గాల ద్వారా విడుదల చేస్తున్న సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, పుకార్లను నమ్మి అనవసరమైన అపోహలు, ఆందోళనలతో అవసరానికి మించి అదనంగా సిలిండర్లు బుక్ చేసుకోవడం జరుగుచున్నదని, అవసరం ఉన్నపుడే సిలిండర్లు బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్, ఈ సందర్భంగా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను ఆసరాగా తీసుకొని, రూమర్స్ ను క్రియేట్ చేయడం, సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంమ గాని లేదా ఏజెన్సీస్ వారు ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం లేదా అధిక ధరలకు విక్రయించడం వంటి బ్లాక్ మార్కెటింగ్ చర్యలు ఎవరైనా చేపట్టినట్లయితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రతి వినియోగదారునికి అవసరమైన గ్యాస్ సిలిండర్ అందేలా జిల్లా యంత్రాంగం మరియు ఆయిల్ కంపెనీలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ, ఎల్సీజ్ నిల్వలు, పంపిణీ, పర్యవేక్షణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి ఎల్పీజీ గృహ వినియోగదారులకు గ్యాస్ ఇబ్బందులు లేకుండా అన్నీ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కువగా బుకింగ్ సర్వర్ స్లో గా ఉందని పిర్యాదులు రావడం జరిగిందని, కంట్రోల్ రూం కు వచ్చే ప్రతి పిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుచున్నదన్నారు. క్షేత్ర స్థాయిలో గ్యాస్ డీలర్ల తో మాట్లాడుతూ, ఎంత స్టాక్ వస్తున్నది, ఎంత స్టాక్ పంపిణీ జరుగుచున్నది అనే విషయాన్ని ప్రతి రోజు పర్యవేక్షించడం తో పాటు సంబంధిత స్టాక్ రిజిస్టర్లను కూడా పరిశీలిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగించకుండా హోటళ్లను, రెస్టారెంట్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో ఎల్పీజీ గృహ వినియోగదారులకు గ్యాస్ ఇబ్బందులు లేకుండా పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *