రాంగోపాల్ పేట మార్చి 17 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ముస్లిం లకు సముచిత స్థానం లభిస్తుందని రాంగోపాల్ పేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు త్రికాల మనోజ్ కుమార్ అన్నారు.ఆత్మీయత, మత సామరస్యానికి రంజాన్ ప్రతీక అని అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఆదేశాల మేరకు రాంగోపాల్ పేట్ డివిజన్ లో రాహుల్ తో కలిసి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 250 ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరుపున తోఫా అందజేశారు.ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు. పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి
మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. రంజాన్ మాసంలోమతసామరస్యానికి ప్రతీక అని.మత సామరస్య భావం పెంపొంది, ప్రజల మధ్య ఐక్యత
పెరుగుతుందన్నారు. మరోవైపు మైనార్టీల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని తెలుపుతూ మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింల అభివృద్ధి కోసం విద్యా, వైద్య, ఉద్యోగ రంగాలలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించి ముస్లింల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి కృషి చేశారని తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


