బేగంపేట 18
(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లీం లకు సముచిత స్థానం లభిస్తుందని. బేగంపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం అన్నారు.సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోట నీలిమ ,రాహుల్ నేతృత్వంలో విశాల్ సుధాం ఆధ్వర్యంలో ముస్లీం మహిళలకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్ కా తోఫా ను విశాల్ స్తానిక ముస్లీం నాయకులు అమానుల్లా ఖాన్. ఇబ్రహీం పటేల్ ,తదితరులతో కలసి తోఫా పంపిణీ చేశారు ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్ కా తోఫా పంపిణీ చేయడం పై సి ఎం కు కృతజ్ఞతలు తెలియ జేశారు.పేదల ప్రభుత్వం కాంగ్రెస్ అన్ని వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫయాజ్ ,ఇబ్రహీం పటేల్ ,చిరంజీవి, నసీర్ (అడ్డు),మాధవి, బుష్రా, జులేఖ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
