19న భగవాన్ వెంకట్రామయ్యస్వామి తిరునాళ్లు. .ఏర్పాట్లను పూర్తిచేసిన నిర్వాహక కమిటీ – ట్రాక్టర్ల రివర్స్ పోటీల కు ఏర్పాట్లు

తాళ్లూరులో వెంకట్రామయ్యస్వామి తిరునాళ్లను గురువారం నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తిచేసారు. దశాబ్దాలకాలంగా ఆలయకమిటీవారు ఏటా శివరాత్రి, తదనంతం ఉగాదిరోజున ఉత్సావాలు జరుపుతూ ఉండేవారు. ప్రస్తుతం 89వ వార్షిక ఉత్సవాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్వం తాళ్లూరు గ్రామపంచాయితీ వ్యవస్థాపకులు నెల్లూరు జిల్లా జమీందారీ రైతుసంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేసిన ఇడమకంటి వెంకట్రామిరెడ్డి జమీందార్ చినకోటిరెడ్డి కుమారుడు. ఈయన తత్వవేత్తగా ఉంటూ ప్రజలకు కాలజ్ఞానాన్ని బొధించేవారు. గ్రామంలోని పేదప్రజలకు సహాయసహాకారాలను అందించేవారు. రైతులకోసం రజానగరం పంటకాలువను నిర్మించి సాగు నీటి వసతిని కల్పించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానాలను బొధిస్తూ ఆయన రెండున్నర దశాబ్దాలక్రితం జీవసమాధికావింపబడ్డారు. ఇక్కడిప్రజలకు ఆయనపై ఉన్న అపారనమ్మకం ప్రేమలతో ఆయన సమాధిపై దేవాలయాన్ని నిర్మించి అప్పటినుండి తిరునాళ్లను జరిపించేవారు. గతంలో ఈతిరునాళ్లకు ఎంతో ప్రాచుర్యం ఉండేది. దేవాలయం వద్దకు వెళ్లేందుకు దోర్నపువాగు అడ్డంగా ఉండటం సక్రమమైన దారిలేకపోవటంతో ఇబ్బందికరంగా ఉండటంతో ఆయన వంశస్తులు, మనుమడు యిడమకంటి వెంకట్రామిరెడ్డి (ఐవీ రెడ్డి) దేవాలయం వద్దకు వెళ్లేందుకు స్వంతనిధులతో దారిని ఏర్పాటుచేసారు. దీంతో భక్తులకు సౌకర్యంగా ఉన్నది.
ఆలయ ప్రాంగణంలో పెద్ద స్టేజీలను కూడ ఏర్పాటు చేయటంతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉన్నది. సాయంత్రం ఏడు గంటల నుండి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ట్రాక్టర్ రివర్స్ పోటీలు …

ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు ప్రధమ బహుమతి రూ. 5వేల రూపాయలు శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ఎవీ రమణా రెడ్డి, ద్వితీయ బహుమతి రూ. 4వేలు గుడి తరపున నిర్వాహకులు, తృతీయ బహుతి రూ.3వేలు కోట క్రిష్ణా రెడ్డి, చతుర్ధ బహుమతి రూజ2వేలు రేగడి వెంకటేశ్వర్లు, పంచమ బహుమతి రూ. వెయ్యి రూపాయలు ఇడమకంటి మణి కంఠ రెడ్డి అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *