ఒకప్పుడు ప్రపంచానికి ఙ్ఞానాన్ని అందించిన భారతదేశం అనేక కారణాలతో తన వైభవోపేతమైన చరిత్రను మర్చిపోయి 1000 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయిందనీ,
అనేకమంది మహోన్నత వ్యక్తుల పరిశ్రమ వల్ల , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వంటి జాతీయవాద సంస్థల త్యాగాలు, స్వయసేవకుల అకుంఠిత దేశభక్తి ,జాతి పునర్నిర్మాణ కార్యపద్ధతి కారణముగా నేడు ప్రపంచం తిరిగి భారతదేశం వైపు చూసే పరిస్థితి మనం చూస్తున్నామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రాంత కార్యకారిణి సభ్యులు పాకాల త్రినాథ్ అన్నారు.
ఒంగోలు నగరంలో ఉగాది పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్సవమలో ప్రసంగించారు.
ఆర్ఎస్ఎస్ ను స్థాపించిన డి .ఆర్ హెడ్గేవార్ వ్యక్తి కంటే దేశం మిన్న అని భావించి తను ఆదర్శంగా ఉంటూ, స్వయసేవకులకు భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడమే అంతిమ లక్ష్యంగా తమ జీవన పద్ధతిని మార్చుకోవాలని ఆచరించి చూపించారని తెలిపారు.
దేశములో ఏ విపత్తు వచ్చినా స్వయసేవకుల ముందుగా స్పందించి వేలాది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న శుభతరుణం లో పంచ పరివర్తన పేరుతో ,(సామాజిక సమరసత,కుటుంబ ప్రబోధం,స్వదేశీ,
పర్యావరణం,పౌర విధి) ..ఈ 5 విషయాలలో సమాజములో చైతన్యం తీసుకురావడం కొరకు విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నదని వారు తెలియచేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వజ్జా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు రాంప్రసాద్,నగర అధ్యక్షులు బత్తిన మహేష్ మరియు నగర ప్రముఖులు పాల్గొన్నారు.


