సికింద్రాబాద్ మార్చి 20
(జే ఎస్ డి ఎం న్యూస్)
హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద క్రైమ్ నంబర్ 135/2026గా కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, పద్మారావు నగర్‌కు చెందిన జి. జనిమ్మ (19) ఈ నెల 17న తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆమె తండ్రి జి. కోటేశ్వరరావు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో ముషీరాబాద్, రామ్‌నగర్‌కు చెందిన పి. జగదీష్ (22)తో మృతురాలు ప్రేమ లో
ఉన్నట్లు తెలిసింది. కొంతకాలంగా ఆమెపై అనుమానం పెంచుకున్న జగదీష్ తరచూగొడవపడుతూ, మానసికంగా వేధిస్తూ, వ్యక్తిగత విషయాలు కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.ఘటన జరిగిన రోజు ఉదయం కూడా నిందితుడు యువతి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగినట్లు విచారణలో తేలింది. అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాలు, నిందితుడి మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ ఈ కేసులో కీలక ఆధారంగా లభించింది.నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, 20 మార్చి 2026న ఉదయం 11:45 గంటలకు జగదీష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
