రామ్ గోపాల్ పేట ,మార్చి 21
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రంజాన్ పండుగను పురస్కరించుకుని రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో పండుగ వాతావరణం నెలకొంది. శనివారం నల్లగుట్టలోని బడి మస్జిద్‌లో ఈద్ ప్రార్థనల అనంతరం, రాంగోపాల్ పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ డివిజన్ నాయకులతో కలిసి ముస్లిం సోదరులకు రంజాన్ ముబారక్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె నల్లగుట్ట బడి మస్జిద్ మౌలానా ఖాలిద్ ని శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మస్జిద్ కమిటీ సభ్యులు మరియు ముస్లిం సోదరులైన మక్బూల్ అలీ, మొహమ్మద్ నాసిర్, మొహమ్మద్ జబీ, మొహమ్మద్ నిజామ్, అస్రార్ ఖాన్, రహీమ్ భాయ్ (కాజు), అబ్దుల్లా, రెహమాన్, ఎజాజ్, ఇక్రమ్, ఎండి సాదిక్బాల్ అలీ, లతీఫ్, ఇమ్రాన్, అబ్బులు, సమీ, సామి లను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సుభాష్ రోడ్‌లోని జామియామసీదును సందర్శించి, మస్జిద్ ప్రెసిడెంట్ మసి ,కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పబ్బం ప్రకాష్, జనార్దన్, బాబా, చందు భాయ్, వినోద్ సింగ్, అరుణ్ భట్, విఠల్, అభిషేక్, బాల నరసింహ, ప్రశాంత్ సింగ్, వాసు మరియు తదితరులు పాల్గొన్నారు.



