ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం సెలవు అనుకున్నారో ఏమోగాని ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది సమయానికి హాజరుకాలేదు. ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా రాగా, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్, రీసర్వే డీటీ, ఆర్ఎలు వచ్చినా కార్యా లయం తాళాలు తీయకపోవటంతో బయట గేటు వద్ద పడిగాపులు కాశారు. ప్రభుత్వం ముందుగా శుక్రవారం రంజాన్ సెలవు ప్రకటించింది. అదే రోజు రాత్రి సెలవు రద్దు చేసి శని వారం సెలవుగా ప్రకటించి శుక్రవారం పని దినముగా ప్రకటించింది. తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకోక పోవటంతో డిప్యూటీ తహసీల్దార్ గోపాలుని.ఫణీంద్ర గ్రామంలో నివాసం వున్న తలారి వద్దకు వెళ్లి తాళంతీసుక వచ్చి 10.45 సమయంలో తలుపులు తీశారు. ఎంపీడీవో కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు పది గంటలకే కార్యా లయానికిరాగా, మిగిలిన సిబ్బంది జిల్లా కార్యాలయంలో పని ఉందంటూ ..అక్కడ పనులు చూసుకుని 10.45 సమయంలో విధులకు హాజరయ్యారు. మిగిలిన కార్యాలయాలు కూడా సెలవు వలె స్తబ్దత గా ఉన్నాయి.

