ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆటో స్టాండ్‌లో ఒక ప్రయాణికుడు
AP 37 U 3884 అనే నెంబర్ గల ఆటో ఎక్కిఒంగోలు ,సీతారాంపురంకి చెందిన డ్రైవర్ షేక్.రషీద్ తో కలిసి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ గేట్ వరకు ప్రయాణించి అక్కడ దిగాడు. అయితే, అతను తన సూట్‌కేస్‌ను ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోయాడు. కొంతసేపటికి తన సూట్‌కేస్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ప్రయాణికుడు వెంటనే ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు.
ఈ విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ రావు కి తెలియజేసారు. వెంటనే స్పందించి, ప్రయాణికుడిని తన మోటార్ సైకిల్‌పై తీసుకుని రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్‌కు చేరుకున్నారు.
అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లను విచారించగా, ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో సూట్‌కేస్ ఉందని, అది ప్రయాణికుడు మర్చిపోయిందని నిజాయితీగా ఆ డ్రైవర్ సూట్‌కేస్‌ను ట్రాఫిక్ ఎస్ఐ కి మరియు రైల్వే స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న హెచ్ జి యాదలింగంకు అప్పగించారు.
తర్వాత ట్రాఫిక్ ఎస్ఐ సూట్‌కేస్‌ను పరిశీలించి, అందులోని వస్తువులు అన్ని ఉన్నాయని నిర్ధారించుకుని ప్రయాణికుడికి అందజేశారు. తన సూట్‌కేస్ తిరిగి పొందిన ప్రయాణికుడు పోలీసులకు మరియు ఆటో డ్రైవర్ నిజాయితీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ జగదీష్ పోలీస్ సిబ్బందిని మరియు ఆటో డ్రైవర్‌ను అభినందిస్తూ, ఇలాంటి నిజాయితీ పనులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రజలు తమ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
