జిల్లా ఉపాది కార్యాలయం వారి ఆధ్వర్యములో టాటా క్యాపిటల్ లిమిటెడ్, ఫ్రాంటియర్-సోలార్, విజన్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీ మ్యాన్‌పవర్ సొల్యూషన్స్ (మాస్టర్ మైండ్), జోయలుక్కాస్, మరియు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలలో రిలోన్ ఆఫీసర్, టెక్నీషియన్లు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌లు, అసోసియేట్ (తెలుగు వాయిస్ ప్రాసెస్), సేల్స్ ఎగ్జిక్యూటివ్, మరియు రికవరీ ఎగ్జిక్యూటివ్ సెక్టార్ లలో వివిధ రకాల ఖాళీలను భర్తీచేయుటకు ఏదైనా విభాగంలో టెన్త్, ఐ.టి.ఐ, ఇంటర్మీడియేట్,ఏదైనా డిగ్రీ, మరియు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులు పూర్తి చేసిన వారికి ఇంటర్వ్యూలు జిల్లా ఉపాది కార్యాలయం, ఒంగోలు నందు 24 న మంగళవారం ఉదయం 10:00 గం. నుండి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాది కార్యాలయం అధికారి కె. రమాదేవి,
తెలిపారు.
ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్థులకు జీతం నెలకు రూ. 14,000/- నుండి రూ.41,000/- వరకు ప్లస్ పనితీరు ఆధారంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుందని,
తెలిపారు. కావున జిల్లాలోని 18సం,, నుండి 40 సం,,మధ్య గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఇంటర్వ్యూ కు ఆధార్ కార్డు మరియు సరిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు.
మరిన్ని వివరములకు *https://employment.ap.gov.in/* లేదా ఆఫీసు పని సమయాలు *08592 281776* లను సంప్రదించాలని తెలిపారు.
24న ఒంగోలులో జాబ్ మేళా
22
Mar