వరిలో సస్య రక్షణ చర్యలు చేపట్టాలి

తాళ్లూరు మండలంలో 3593 ఎకరాలలో వివిధ దశలలో వరి సాగులో ఉందని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. వరి పడిపోయిన చేలలో గింజలు రంగు మారటం, మాగుడు, మాని పండు తెగులు వ్యాపిస్తాయని నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎకరానికి 200మి.లీల ప్రాపికోజోల్, టిల్ట్ పిచికారి చెయ్యాలని కోరారు. నూర్చిన ధాన్యాన్ని రెండు మూడు రోజులు ఎండబెట్టటానికి వీలుకాక పోతే కుప్పలలో గింజలు మొలకెక్కకుండా ధాన్యానికి 1 కిలో ఉప్పు మరియు 20కిలోల పొడి ఊక కలపాలని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *