రైతులు పంట మార్పిడి చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తూర్పుగంగవరంలో సోమవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి సాగు పద్దతులు పాటించి నికర లాభం పొంది అనేక రకాల పంటలను పండించాలని కోరారు. నీటి ఎద్దడి తట్టుకునే వంగడాలను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. రానున్న వేనవిలో నేలను పచ్చదనంం కప్పిపుచ్చడానికి పి యం డి ఎన్ విత్తనాల కిట్లను వాడుకోవాలని కోరారు. వర్షాలకు ముందుగా 30 రకాల విత్తనాలను చల్లడం వలన తొలగిరి జల్లులను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో విఏఏ సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
