తాళ్లూరు మండలంలో సోమవారం నిర్వహించిన ఎస్. ఎస్ సి లెక్కలు పరీక్షకు 9 మంది గైర్హాజరు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావు లు తెలిపారు.
బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 184 మంది గాను ఒకరు గైర్హాజరు, తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 249 మంది గారు ఇరువురు గైర్హాజరు, వికే ఉన్నత పాఠశాలలో 161 మంది గాను ఇరువురు గైర్హాజరు, నరస్వతి అన్ ఎయిడెడ్ పాఠశాలలో 121 మంది కి గాను నలురుగురు గైర్హాజరు అయినట్లు చెప్పారు. దర్శి ఎంఈఓ రమాదేవి అధికారులు స్క్వాడ్ బృందం తాళ్లూరు, తూర్పుగంగవరం పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఆయా పరీక్షా కేంద్రాలకు డీఓలుగా చాంధ్ బాష, యు వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మమ్మ, మోహన్ గాంధీ, చీఫ్ లుగా శ్రీనివాస రావు, స్వామి దాసు, శ్రీ రంగ నాయకులు, నవనీతమ్మ లు వ్యవహరించారు.