జనగణన-2027 కు సంబంధించి నిబంధనలను, పద్ధతులను పూర్తిగా అవగాహన చేసుకోవాలి – జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు

జనగణన-2027 కు సంబంధించి నిబంధనలను, పద్ధతులను పూర్తిగా అవగాహన
చేసుకొని జిల్లాలో జనగణన ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఫీల్డ్ ట్రైనర్స్ ను ఆదేశించారు.
ఒంగోలు కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హల్లో సోమవారం జిల్లాలో జనగణన ప్రక్రియ పై ఫీల్డ్ ట్రైనర్స్ కు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, జిల్లాలో జనగణన ప్రక్రియ కు సంబంధించి రెండు విడతల్లో 65 మంది ఫీల్డ్ ట్రైనర్స్ కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ నెల 23,24,25 మూడు రోజుల పాటు మొదటి విడతలో, ఈ నెల 26,28,29 తేదీల్లో మూడు రోజుల పాటు రెండో విడతలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ అనంతరం వీరు క్షేత్ర స్థాయిలో పనిచేసే ఎన్యూమరే టర్లకు , సూపర్వైజర్ల కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ శిక్షణా తరగతుల్లో సంబంధిత అధికారులు, ఫీల్డ్ ట్రైనర్స్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *