జిల్లా లో ఎక్కడా వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదు – వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందనవరం లేదు – జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి

జిల్లా లో ఎక్కడా వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందనవరం లేదని జాయింట్ కలెక్టర్
స్పష్టం చేశారు.
సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, అన్నీ శాఖల అధికారులతో సమావేశమై జిల్లా లో వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ వినియోగం, సరఫరా , తీసుకోవాల్సిన చర్యలు పై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరాకు ఆటంకం లేకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. జిల్లా లో ఎక్కడా వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందనవరం లేదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. రెవిన్యూ మరియు పౌర సరఫరా అధికారులు , ఆయిల్ కంపెనీ ప్రతినిధులు మరియు గ్యాస్ ఏజన్సీ డీలర్లుతో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వినియోగదారులకు అవసరమైన వంట గ్యాస్, డీజిల్, పెట్రోలు నిల్వలు అందుబాటులో ఉంచే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసిన, కొనుగోలు చేసినా చర్యలు చేపట్టాలని జాయింట్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ ఆసుపత్రులుకు గ్యాస్ కొరత లేకుండా సంబంధిత అధికారులు పౌర సరఫరా శాఖ అధికారులతో సమన్వయమ చేసుకోవాలని, రోజు వారీ ఎంత డిమాండ్ ఉంది, ఎంత సరఫరా అవుతున్నది, రానున్న వారం రోజుల్లో ఎంత అవసరం ఉంది తదితర వివరాలతో సమగ్ర నివేదిక తాయారు చేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే పరిశ్రమల, వ్యవసాయ దాని అనుబంధ రంగాల నిర్వహణకు రోజువారీ డీజిల్ ఎంత అవసరం ఉంది, ఎంత సరఫరా అవుతున్నది తదితర వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని జాయింట్ కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులు నమ్మవద్దని, నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ కొనసాగుతుందని జాయింట్ కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందనవరం లేదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డి ఎస్ ఓ పద్మశ్రీ,, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వర రావు, డిటిసి సుశీల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, డి ఎస్ ఓ పద్మశ్రీ, బిసి వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, ఇరిగేషన్ ఎస్ ఈ వరలక్ష్మి, ఆర్ టి సి ఆర్ఎం సత్యనారాయణ, డిఈఓ రేణుక, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాస రావు, శ్రియా వెంకటేశ్వర రావు శ్రీనివాస రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *