ఒకటి నుండి 5వ తరగతి చదువు తున్న విద్యార్థులు అందరికి 2026 మార్చి నాటికి చదవటం, గణితంలో నిపుణ్ లక్ష్యాలను సాధించాలనే ఉద్దెశ్యంతో ప్రభుత్వం గ్యారెంటెట్ పౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీ ఎఫ్ ఎల్ ఎన్ ) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య తెలిపారు. మండలంలో మంగళవారం క్లస్టర్ స్థాయిలో జీ – ఎఫ్ ఎల్ ఎన్ విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించి పోటీలను నిర్వహించారు. బొద్దికూరపాడు, తూర్పుగంగవరం, తాళ్లూరు క్లస్టర్ పరధిలో పోటీలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ – 2 సుధాకర రావు, వికే పాఠశాల హెచ్ఎం మిల్టన్, ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
