ప్రభుత్వం పల్లె పండుగలో నిర్మించిచిన మంచి నీటి తొట్లు పశపోషకులకు వేసవిలో
వరమని ఎంపీడీఓ అజిత అన్నారు. వేనతి సమీపిస్తున్న తరుణంలో పశువులకు అవసరమైన నీటి తొట్ల పరిస్థితిని ఎంపీడీఓ మంగళవారం పరిశీలించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ ఉ పాధి హామీ పథకంలో పల్లె పండుగ కార్యక్రమంలో మండలంలో పశువుల నీటి తొట్లు 11 నిర్మించినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. ఈ నీటి తొట్లకు నీరు ఎప్పుడు నరఫరా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమపై ఆధార పడ్డ వేలాది పశుపోషకులకు, జీవాలకు స్వచ్ఛమైన నీరు అందించటమే లక్ష్యంగా పశువులు, జీవాలు దూరం పోకుండా అవి ఎక్కువగా వచ్చే ప్రాంతాలకు గుర్తించి నీటి తొట్టులు నిర్మించినట్లు తెలిపారు. పరిశీలనలో ఎపీఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

