మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో రూ. 2,92,500 లక్షల సీ.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను పంపిణీ చేసిన డాక్టర్ జీ. చిన్నారెడ్డి.

హైదరాబాద్ మార్చి 24,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన ఏడుగురికీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల 92 వేల 500 రూపాయల ( 2,92,500 ) చెక్కులను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జి డాక్టర్ జీ. చిన్నారెడ్డి అందజేశారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన కార్యక్రమంలో చిన్నారెడ్డి సంబంధిత వ్యక్తులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం అందుకున్న వారిలో హైదరాబాద్ కాటేదాన్ కు చెందిన మహమ్మద్ మజీద్ కు రూ60,000 లు, కాటేదాన్ కు చెందిన మధుసూదన్ రెడ్డికి రూ 85,000 లు, కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ కు చెందిన అశోక్ రావుకు 60 వేల రూపాయలు, హైదరాబాద్ చార్మినార్ కు చెందిన సర్ఫరాజ్ హుస్సేన్ కు రూ38,500 లు, బొమ్మలరామారం గ్రామానికి చెందిన రవి కి 17వేల రూపాయలు సిద్దిపేట రాయపూర్ కు చెందిన ఉదయపు 8 వేల రూపాయలు, సరూర్నగర్ ఆర్కే పురంనకు చెందిన మహేష్ కు 24 వేల రూపాయల చెక్కులను చిన్నారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,చిన్నారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *