హైదరాబాద్ మార్చి 24
(జే ఎస్ డి ఎం న్యూస్) :
వేసవిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలో చలివేంద్రాలను టీజీఎస్పీఎఫ్ కమాండెంట్ ఎస్ అన్వర్ భాష ,అడిషనల్ అడ్వకేట్ జనరల్ టి.రజినీకాంత్ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. టి జి ఎస్ పి ఎఫ్ డిజిపి స్వాతిలక్రా ఆదేశాల మేరకు హైకోర్టులో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్వర్ భాష మాట్లాడుతూ హైకోర్టుకు వివిధ కేసుల నిమిత్తం వచ్చే వారి కోసం నాలుగు, ఆరు గేట్ల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. తాత్కాలికంగా మట్టి కుండలలో నీరు అందించేలా ఏర్పాటు చేశామని, త్వరలో చల్లని తాగునీరు అందించే మిషన్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసి ఎమ్మెస్ రెడ్డి, శ్రీనివాసరావు సిఐలు ఎస్సైలు పిఎస్సైలు పాల్గొన్నారు.

