హైదరాబాద్ మార్చి 25
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆర్థోపెడిక్ వైద్యరంగంలో విప్లవాత్మక పానోస్కోపీ టెక్నాలజీకి భారత్ స్వాగతం పలికింది.భారతదేశంలోనే మొదటిసారిగా పానోస్కోపీ టెక్నాలజీ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లోభారతదేశంలో విప్లవాత్మక పానోస్కోపీ టెక్నాలజీ ప్రారంభిస్తూ ఆర్థోపెడిక్ వైద్యరంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేశారు. ఈ ఆధునిక టెక్నాలజీ సాయంతో భుజం, మోచేతు, మణికట్టు, మోకాలు వంటి చికిత్సల్లో మార్పులు తీసుకురావడమే కాకుండా లిగమెంట్ చీలికలు, కండరాల గాయాలు, టెండన్ సమస్యలు వంటి క్రీడా గాయాల నిర్వాహణను మరింత సమర్థవంతంగా మార్చనుంచి ఈ టెక్నాలజి.
ఈ సందర్భంగా బుధవారం బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లోనిర్వహించిన విలేకరుల సమావేశంలో ” పానోస్కోపీ” టెక్నాలజీని అధికారికంగా భారతదేశంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ ఆర్థ్రోస్కోపీ పద్దతి ఉపయోగకరమైనది అయినప్పటికీ, దాని పరిమిత దృశ్య పరిధి కారణంగా కొన్ని సందర్భాల్లో లోతైన లేదా క్లిష్టమైన సంధి గాయాలను గుర్తించడం కష్టమవుతుందని తెలిపారు. పానోస్కోపీ టెక్నాలజీ ద్వారా విస్తృతమైన వీక్షణ లభిస్తుందని, సంధి ప్రతి మూలను స్పష్టంగా పరిశీలించి, ఖచ్చితమైన నిర్ధారణతో మెరుగైన శస్త్రచికిత్స ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ షోల్డర్ సర్జరీ మరియు స్పోర్ట్స్ సర్జరీ విభాగం డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పానోస్కోపీ టెక్నాలజీ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా ఇంతవరకు గుర్తించని గాయాలను సులభంగా గుర్తించి, క్లిష్టమైన శస్త్రచికిత్సలను అధిక ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చని వివరించారు. భుజం డిస్లోకేషన్స్, రోటేటర్ ఖఫ్ చీలికలు, ప్రోజన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో, మోకాలి లిగమెంట్ గాయాలు వంటి సమస్యల చికిత్సలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా రోగులు కోలుకునే సమయం పెరగడంతో పాటు, దీర్ఘకాలిక ఫలితాలు మొరుగుపడతాయన్నారు.
పానోస్కోపీ టెక్నాలజీతో జాయింట్లలో ఉన్న బ్లైండ్ స్పాట్స్ (లోతైన గాయాలను) తొలగించడం ఇప్పటివరకు ఉన్న పద్దతులపై స్పష్టమైన ఆధిక్యతను చూపుతుంది. ఇది సంధి అంతర్భాగాన్ని సమగ్రంగా చూపించడం వల్ల చిన్న తరహా లేదా లోపలి గాయాలను కూడా ఖచ్చితంగా గుర్తించి చికిత్స చేయడానికి సహాయపడుతుంది. ఫలితంగా మరింత ఖచ్చితమైన శస్త్రచికిత్సలు, మెరుగైన రోగి సంరక్షణ సాధ్యమవుతుంది.
సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ ఎప్పటికప్పుడు ఆధునిక వైద్య సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ ముందంజలో నిలుస్తూ, ఈ పానోస్కోపీ టెక్నాలజీని భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టడం గర్వకరణంగా బావిస్తోంది. ప్రపంచ స్థాయి ఆర్థోపెడిక్ చికిత్సను అందించాలనే తమ కృషికి ఇది మరింత బలపరుస్తుందన్నారు.




