గుంటి గంగ తిరుణాలలో విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేయు నిర్వాహకులకు దర్శి సిఐ వైరామారావు పలు సూచనలు

ఏప్రిల్ మూడో తారీకు జరుగునున్న గుంటి గంగ అమ్మవారి తిరుణాల సందర్భంగా తడిక ప్రభలు లేదా విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేయదలచుకున్న వారికి దర్శి సి వై రామారావు పలు సూచనలు చేశారు.
గత సంవత్సరం గంటిటిగంగ అమ్మవారి తిరునాళ్లకు భక్తులు పెద్ద సంఖ్యలో రావటం ,
అలాగే ఆర్గనైజర్స్ మరియు భక్తులు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేయడం తో
గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ ప్రభలు అమ్మవారి గుడి వైపు నుండి తూర్పు గంగవరం వైపుకు గుడికి దగ్గరగా మరియు మెయిన్ రోడ్డుకు పక్కనే ఏర్పాటు చేసినందువలన భక్తులు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దానిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం తిరునాళ్లకు భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను ప్రభలు ఏర్పాటు చేసేసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా సహకరించి గుడి వైపు నుండి గంగవరం వైపుకు 500 మీటర్లు దాటిన తర్వాత మెయిన్ రోడ్డుకు పూర్తిగా లోపల ఏర్పాటు చేసుకునే విధంగా, అలాగే గుడి వైపు నుండి చీమకుర్తి రోడ్డు వైపుకు 300 మీటర్లు దూరంలో మరియు మెయిన్ రోడ్డుకు పూర్తిగా లోపల కు వెళ్లే విధంగా పోలీస్ శాఖ వైపు నుండి సూచించారు.
అందుకుగాను రెండు మూడు రోజుల్లో అన్ని శాఖల అధికారులతో మరియు దేవస్థాన కమిటీ వారితో అలాగే ఎవరైతే ప్రభలు ఏర్పాటు చేయదలచుకున్నారు వారందరితో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయబడు తుందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *