అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రాబోవు మూడు సంవత్సరములలో కనిగిరి కనకపట్నంగా మారుతుందని అనడానికి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషి పట్టుదల కారణమని మంత్రి జనార్దన్ రెడ్డి కొనియాడారు.
పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన లు ప్రారంభోత్సవాల కి బుధవారం కనిగిరి కి విచ్చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కనకపట్నం నుండి ఏపీ ఆర్ కాలేజీ వరకు నూతనంగా మంజూరైన రూ.4 కోట్ల 80 లక్షల గల ఆర్ అండ్ బి రోడ్డుకి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోరూ. 4కోట్ల 99 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కనిగిరి రూరల్ మండలం నేలటూరి గొల్లపల్లి పంచాయతీలోని 2.19 కోట్లతో బిటి రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం లో ఆర్ అండ్ బి రోడ్లకు అనుబంధంగా ఉన్న పంచాయతీ రోడ్లను రోడ్ల భవనాల శాఖ పరిధిలోకి చేర్చాలని ఎమ్మెల్యే కోరారని వాటిని పరిశీలించి ఆర్ అండ్ బి పరిధిలోకి తీసుకొని వచ్చి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కనిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండ కృష్ణారెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీయువత అధ్యక్షులు దొడ్డ సురేష్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పిచ్చాల శ్రీనివాసరెడ్డి, బజాజ్ బాలు ఓబుల్ రెడ్డి, కనిగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి, శివరామిరెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు, డిగ్రీ కాలేజీ అధ్యాపకులు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


