కాంగ్రెస్ గద్దెనెక్కి రెండున్నర ఏళ్ళు అయినా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలే..15రోజుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలి.లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం….రెడ్డి సంఘాల నేతలు.

రాంగోపాల్ పేట్ మార్చి 26,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ళు పూర్తి అయినా, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు హెచ్చరించారు. సికింద్రాబాద్ కరణ్ సెంటర్ కార్యాలయంలో వారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్ర రెడ్డి సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్డి కార్పొరేషన్ కి వెంటనే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. రెండున్నర సంవత్సరాలు దాటిన హామీ అమలుకు నోచుకోకపోవడంతో తాము సమావేశం కావాల్సి వచ్చిందన్నారు.15రోజుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలనీ,
లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తా మని రెడ్డి జేఏసీ , రెడ్డి ఐక్యవేదిక, రెడ్డి సంఘం తెలంగాణ, రెడ్డి జాగృతి తదితర సంఘాల అధ్యక్ష కార్యదర్శులుఅప్పమ్మ గారి రామిరెడ్డి, ఏనుగు సంతోష్ రెడ్డి గోపు జైపాల్ రెడ్డి బుట్టెం గారి మాధవరెడ్డి ఫైళ్ళ హరినాథ్ రెడ్డి చందుపట్ల నరసింహారెడ్డి ఎలిమినేటి సుమన్ రెడ్డి చినుకుల నరసింహారెడ్డి ఏ కిషన్ రెడ్డి రవీందర్ రెడ్డి సామల శ్రీధర్ రెడ్డి లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *