తూర్పుగంగవరం ఇండెన్ గొడౌన్ వద్ద వినియోగదారులు గురువారం బుక్ చేసిన వారికి గ్యాస్ అందించాలని ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన మండల రెవిన్యూ అధికారి సుధీర్ కుమార్ గౌడౌన్ వద్దకు వెళ్లగా అక్కడ గేట్లు వేసి ఎంత సేపటికి గొడౌన్ వద్ద ఉన్న గ్యాస్ సిబ్బంది గేటు తీయక పోక పోవటంతో ఆర్ ఐ వచ్చారని గేటు తీయ్యాలని వినియోగదారులు సైతం చెప్పినప్పటికి గేటు తీయలేదు…. పై పెచ్చు ఆర్. ఐ ఐడీ కార్డు చూపాలని నీవు కార్డు చూపు …అంటూ ఎక వచనంతో సంబోధిస్తూ దురునుగా ప్రవర్తించారు. దీంతో అక్కడే ఉన్న వినియోగదారులు సైతం సిబ్బంది ప్రవర్తన పట్ల ఆశ్చర్య వ్యక్తం చేస్తూ… ఇండెన్ సిబ్బంది మణి కి సర్ది చెప్పటంతో గొడౌన్ లోపలికి ఆర్ఐ వెళ్లారు. అక్కడ గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకుడు శ్రీనివాస రావుతో మాట్లాడారు. గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే సిబ్బంది వివరాలు, ఇండెంట్, స్టాకు వివరాలు తెలిపాలని కోరారు. తాళ్లూరులో కార్యాలయంలో పుస్తకాలు ఉన్నాయని శ్రీనివాస రావు చెప్పారు. దురుసుగా వ్యవహరించిన సిబ్బంది విషయం సైతం చర్చించారు. అనంతరం కొంత సేపటికి తహసీల్దార్ రమణా రావు గ్యాస్ గౌడౌన్ వద్ద కు వెళ్లి స్టాకు వివరాలు, ఇతర విషయాలు ఎజెన్సీ నిర్వాహకులతో చర్చించి వచ్చారు. అయితే ఆర్.ఐ
పై దురుసుగా వ్యవహరించిన విషయం మై కనీసం చర్చకు రాక పోక పోవటంపై వినియోగదారులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అధికారులపైనే ఇలా దురునుగా వ్యవహరిస్తుంటే ఇక సామాన్యులు ఎవైనా
మాట్లాడితే పరిస్థితి ఏమిటని వినియోగదారులు తీవ్రంగా చర్చించుకున్నారు. ఈ విషయమై తహసిల్దార్ రమణారావు వివరణ అడగా ఆర్. ఐ పై ఏజెన్సీ సిబ్బంది దురుసు ప్రవర్తన విషయం తన దృష్టికి తీసుకు రాలేదని తెలుసుకొని పరిశీలిస్తానని చెప్పటం విశేషం.

తహసిల్దార్ పరిశీలన ఇలా..

జనం…ఇలా