బేగంపేట మార్చి 27 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ ఎస్పి రోడ్డు శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో ఈవో ఎం శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయాన్నీ వివిధ రకాలైన పూలతో సుందరంగా అలంకరించారు .ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కళ్యాణానికి నగరం పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని కనుల పండుగ తిలకించారు. సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు .అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.


