సికింద్రాబాద్ మార్చి 30,(జే ఎస్ డి న్యూస్ ) :
సామాజిక సేవలో తమ వంతు కృషి చేస్తున్న వారిని సత్కరించుకోవడం మన అందరి బాధ్యత అని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ 320ఏ గవర్నర్ జీ మహేంద్ర కుమారెడ్డి అన్నారు.
సికింద్రాబాద్ లయన్స్ భవన్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 320ఏ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవ చేస్తున్న సామాజిక కార్యకర్తలకు లయన్స్ ఉగాది జాతీయ పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం తదితర రంగాల్లో ఎంతో మంది విశిష్ట సేవలు అందిస్తున్నారని అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల రూపాయలు వెచ్చించి పేద, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సేవా బావాన్ని అలవర్చుకోవాలని అది కేవలం డబ్బే కాకుండా సమయం తదితర రూపాల్లో అందించవచ్చని అన్నారు. సేవ చేస్తున్న వారిని సత్కరించడం వల్ల వారిని మరింత ప్రోత్సహించిన వారము అవుతామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జలంధర్ గౌడ్ తో పాటు 100 మందిని ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో ఫస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ సురేష్ జగ్నాని, డాక్టర్ శశికాంత్, డాక్టర్ సూర్యసారాయణ, యాదయ్యగౌడ్, నైనాదేవి, ఉమాశంకర్‌రెడ్డి, డాక్టర్ కోటేశ్వరరావు. స్వప్న వెల్లం, పవన కుమార్, మురళి కృష్ణ, సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.
