ఘనంగా ఎంబీఏ గ్రాడ్యుయేషన్ వేడుకలు

సికింద్రాబాద్, మార్చి 30 ,( జే ఎస్ డి ఎం ఏ) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సికింద్రాబాద్‌లోని కస్తూర్బా గాంధీ మహిళా కళాశాలలో ఎంబీఏ 2025 బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సుధాకర్ గాందే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ కొత్త అవకాశాల ఆరంభమని, మారుతున్న వ్యాపార ప్రపంచంలో ఆవిష్కరణ, నైతిక విలువలతో కూడిన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యం పెరుగుతోందని, విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో సెక్రటరీ-కమ్-కరస్పాండెంట్ మొహమ్మద్ ఫహీముద్దిన్, జాయింట్ సెక్రటరీ జి.ఎం. రమేష్, ట్రెజరర్ డి. సురేష్ కుమార్, ప్రిన్సిపల్ డా. రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, మహిళా పట్టభద్రులు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *